Temple History
While touring with his disciples, Sri Vyasatheerthulu and his group took a break at Indra Kiladri. It was during this time that Lord Maruti appeared in the form of a vanara and signaled for them to follow him. They obediently followed Lord Maruti, crossing mountains and forests until they reached the present location of Machavaram. In his vanara form, Lord Maruti instructed Sri Vyasatheerthulu to build a temple at that spot and install an idol of Anjaneya with Sankha and Chakra on either side. After giving these directions, Lord Maruti recited Ramanamam and disappeared towards the north. Following Lord Maruti's instructions, Sri Vyasatheerthulu began the construction of the temple and then left for another village.
Rediscovery of the Vigraham and Vigraha Pratista
After the fall of the Vijayanagera samrajya and the rise of other powers, many temples, including those built by Sri Vyasatheerthulu, fell into ruin. About one hundred and fifty years ago, a contractor named Sri Dunna Veeraswamy Naidu was constructing the Eluru-Vijayawada road. During this time, Lord Anjaneya appeared in his dream and directed him to excavate the idol from a specific location. Sri Naidu followed the divine guidance and brought his laborers to the designated site for excavation. They unearthed a small, exquisite idol adorned with Sindhoora decoration from the very spot where a peepal tree stood. Sri Naidu immediately arranged for a temporary shelter to allow devotees to have darshan of the idol. Prior to the temple's construction, the peepal tree provided a pleasant shade at the site, and it still stands there today.
Since then, the Lord Anjaneya of this kshethra has been fulfilling the desires of devotees with his blessings.
Sthala Purana of the Shrine is handed down from elders but there are no authentic inscriptions.
ఆలయ చరిత్ర
శ్రీ వ్యాస తిర్డులవారి శిష్యగణముతో పాదయాత్ర చేయుచు ఒకనాటి రాత్రి ఇంద్రకీలాద్రి ఫై విశ్రమించుచుండగా మారుతి ఒక వానర రూపమున వచ్చి వ్యాసతిర్డుల వారిని తట్టి లేపి తనను అనుసరించమని సైగ చేయగా వారందరును మారుతిని అనుసరించి అట్లు తూర్పు దిశగా గుట్టలు,పుట్టలు దాటుకొని వచ్చి ప్రస్తుతం మాచవర దేవస్థానం వ్యవహరించబడుచున్న ప్రదేశమునకు వచ్చి తనకు ఆలయమును నిర్మించమనిచమని చెప్పి మరియు విగ్రహమునకు ఇరు వైపుల వైష్ణవ చిహ్నము శంకు చక్రములను చిత్రించమని కాలక్రమమున ఇది గొప్ప దివ్య క్షేత్రము అగునని చెప్పి అచ్చట నుండి శ్రీరామ, శ్రీరామ ,శ్రీరామ అనుచు ఉత్తరదిసకు తిరిగి చేతులు జోడించి అదృశ్య మై రి. శ్రీ స్వామి వారి ఆదేశానుసారము దేవస్థానము నిర్మించడ మైనది .
కాలాంతరమున విజయనగర సామ్రాజ్యం శత్రు రాజుల పరాదినమమై కొన్ని ఆలయములు శీధిలమై పోయినవి. తిరిగి సుమారు 150 సంవత్సరం క్రితం నూతనముగా ఏలూరు –విజయవాడ రోడ్ మార్గమును నిర్మించు చుండగా అప్పటి రోడ్ కాంట్రాక్టర్ శ్రీ దున్నా వీర స్వామి నాయుడు గార్కి స్వప్ననమున కనిపించి తన ఉనికి తెల్పి బహిర్గతము కావింపమని ఆదేశించిరి .మరునాడు కూలిలచే శ్రీ స్వామి చెప్పిన గుర్తలయందు త్రవ్వించి చూడగా శ్రీ స్వామి వారి దివ్య మంగళ విగ్రహము సిందూరపు పూతతో బహిర్గతమైనది .అప్పటికప్పుడు చిన్న పందిరి నిర్మించి భక్తుల దర్శనార్డం ఏర్పాటుచేసిరి. ఆలయ నిర్మాణమునకు ముందునుండి ఒక రావి చెట్టు శ్రీ స్వామి వారికీ చల్లని అచ్చాదనము కల్పించు చున్నది. ఇది నేటికిని కలదు .ప్రతి నిత్యమూ ఆబాల గోపాలము శ్రీ స్వామి వారిని దర్శించి తమకోర్కెలు నెరవేరుటకు అర్చనాదులు జరిపించుకోనుచున్నారు. ప్రత్యేకముగా నిత్యము నూతన వాహనముల పూజలు జరుగుచున్నవి.
శ్రీ స్వామి వారి స్థల పురాణము పెద్దల నుండి అనుశ్రుతముగా చెప్పబడినదే కానీ ప్రామాణికముగా ఎటువంటి శిలాశాసనములు లేవు .